

మాజీ సర్పంచ్ దాట్ల విరస్వామి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కొండపాక మాజీ సర్పంచ్ దాట్ల మంగ సమ్మయ్య దంపతుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాక గ్రామం లో పురాతన శివాలయంలో కన్నుల పండుగ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం చాలా ఘనంగా జరిపించారు. పట్టు వస్త్రాలు స్వామివారికి, సమర్పించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు.. కొండపాక లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి అక్షింతలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలు ను మాజీ సర్పంచ్ దాట్ల వీరస్వామి, మరియు మాజీ సర్పంచ్ దాట్ల మంగ సమ్మయ్య దంపతులు అందజేశారు. సుమారు గా గ్రామ ప్రజలు భక్తులు, 800 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పురోహితుడు రాంపల్లి భాస్కర్ శర్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన దాతలు దాట్ల మంగ సమ్మయ్య, వీరస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు మరియు యువకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు అందరు పాల్గొన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేసిన దాట్ల వారి కుటుంబాన్ని భక్తులు ప్రజలు నాయకులు ఆశీర్వదించారు.
