

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో జలవికాస ఆధ్వర్యంలో బండ విజయ రాజయ్య కూతురు జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కార్యక్రమానికి 22వ వార్డు అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు మంద రాజేష్ హాజరయ్యారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ 22వ వార్డు అధ్యక్షులు మంద రాజేష్ మాట్లాడుతూ.. బాల వికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, నా వంతుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి, మా వార్డు ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి సమస్యలు తెలుసుకొని, నా వంతు సహాయంగా వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని, బండ రాజయ్య, విజయ ల కూతురుకి ఆత్మ శాంతి చేకూరాలని, అన్నారు.