Listen to this article

జనంన్యూస్ ఏప్రిల్ 06:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలోని తాళ్ళరాంపూర్ గ్రామములో ఆదివారంరోజునా రామాలయం దేవాలయం లో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా గ్రామాభివృద్ధికమిటి ఆధ్వర్యంలో సీతారాములకళ్యాణం ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్న సుముహూర్తం, భాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయం గా వేదంపండితులు నంబీ శ్యామ్, వాసు చల్లా, స్థానిక పురోహితులు దోమకొండ విష్ణు శర్మ ఆధ్వర్యంలో మంత్రోచ్చారణలతోఘనంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ్ణి తీలకించేతందుకు గ్రామ ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారికీ కట్నకానుకలు సమర్పించుకొని, పూజలు చేసి తీర్థ ప్రసాదలు స్వీకరించారు. సోమవారం రోజునా అన్నదానం గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు.