Listen to this article

జుక్కల్ మార్చి 7 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో సొసైటీలో వరి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు డోంగ్లి సొసైటీ చైర్మన్ రామ్ పటేల్ కలిసి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. డోంగ్లీ మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జై బాపు – జై భీమ్- జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఉమాకాంత్ పటేల్ , నాగేష్ పటేల్ ,వసంతరావు పటేల్, సాయి పటేల్, ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు