

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
సామాజిక న్యాయం సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా,,వీరేంద్ర కుమార్ అద్యక్షతన ఈనెల 7,8 తేదీల్లో డెహ్రాడూన్ లో జరగనున్న చింతన్ శివిర్ కార్యక్రమం లో, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతుల , షెడ్యూల్ కులాలు , షెడ్యూల్ తెగల కు చెందిన మంత్రులు, పాల్గొననున్నారు.
రెండు రోజుల పాటు డెహ్రాడూన్ లో జరగనున్న చింతన్ శివిర్ లో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు , వారి సంక్షేమం ,అభివృద్ధి ,దేశానికి దిక్సూచిగా కుల గణన ,బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల పై,మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశాంగించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో వయవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రశాంగించనున్నారు.ఈ చింతన్ శివిర్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా, ఉన్న చట్టాలు , అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రాలు ,కేంద్రం కలిసి పని చేసే అంశం పై చర్చ జరగనుంది.వెనుకబడిన తరగతులు ,షెడ్యుల్ కులాలు ,షెడ్యూల్ తెగలు,సీనియర్ సెటిజన్లు ,మధ్య వ్యసనం,మాదక ద్రవ్యాల దుర్వినియోగ బాధితులు,లింగమార్పిడి వ్యక్తులు,యాచకులు, మెన్యువెల్ స్కవెంజర్స్,సంచార తెగలు ,ఆర్థికంగా వెనుకబడిన వారు వైకల్యాలున్న వ్యక్తులు సమాజంలోని వివిధ విభాగాల ద్వారా సంక్షేమం కోసం వివిధ చట్టాలు పథకాల అమలు పై చింతన్ శివిర్ లో చర్చించనున్నారు.
చింతన్ శివిర్ కి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి,బీసీ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొననున్నారు.