Listen to this article

బిజెపి పట్టణ కార్యాలయంముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం..

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట…

భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆద్వర్యంలో, బిజెపి పట్టణ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు, కొలకాని రాజు బిజెపి జెండా ఎగురవేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఆకుల రాజేందర్, కొలకాని రాజు మాట్లాడుతూ…1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజపేయి అద్వానీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ ని స్థాపించడం జరిగింది అన్నారు. రెండు ఎంపీ సీట్లతో మొదలైన బిజెపి ప్రస్థానం నేడు పార్లమెంటు లో 300 పై చిలుకు స్థానాలు గెలుచుకుని బలమైన శక్తిగా ఎదిగింది అని, తెలిపారు. అనేక రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బిజెపి నే ప్రత్యామ్నాయంగా గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో ఎంపీలను గెలిపించారని,అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా జమ్మికుంట ప్రజలు బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, శీలం శ్రీను, రాజేష్ ఠాకూర్,దొంతుల రాజు కుమార్, పల్లెపు రవి, అప్పం మధు, మోతె స్వామి, ఇటుకాల స్వరూప, మోడం రాజునిరుపరాణి, లక్ష్మి, కేశ స్వరూప, బచ్చు శివన్న, కొమ్ము అశోక్, రాకేష్ ఠాకూర్, రామస్వామి, కొండపర్తి ప్రవీణ్ ఉడుగుల మహేందర్, పొనగంటి రవి, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి అఖిల్, బురుగుపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.