Listen to this article

జీవి రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పోలాడి రామారావు, నాయకులు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

కరీంనగర్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు, సుడా మాజీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది జీ వీ రామకృష్ణా రావు జన్మదినం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రంలోని జీవీ నివాస గృహంలో సోమవారం రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకుల తో కలిసి జీవి రామకృష్ణారావు కు పూల బొకె అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇ సందర్బంగా రామారావు మాట్లాడుతూ..సౌమ్యుడు గా వివాద రహితుడిగా జిల్లా వ్యాప్తంగా పేరున్న జీ వీ . సామాన్యులకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించే రామకృష్ణా రావు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆశిస్తూన్నా అన్నారు,రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత పదవులను అలంకరించాలని జిల్లా వ్యాప్తంగా జీవి అభిమానులమైన మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారావు తో పాటు పోల్సాని దేవేందర్ రావు, రెడ్డి సంపత్,జనగామ దేవేందర్ రావు, గంగుల రవి, గడ్డి రాజు, అకునూరి రమేష్, పోల్సాని రాం కిషన్ రావు మానకొండూర్ నియోజక వర్గ వ్యాప్తంగా నాయకులు జీవి అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని స్వీట్లు మిఠాయిలు పంచుకొని జీవి కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.