

జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఐదవ వార్డుకు చెందిన శివ సుగుణమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి 42 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శివ సుగుణమ్మకు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని అన్నారు, కష్టాలలో ఉన్న పేదవారికి ఈ చెక్కు చేదోడు వాదోడుగా పనిచేస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జి, ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర వెంకటరెడ్డి, అంజాద్ ఖాన్, రాధికా బాయి తదితరులు పాల్గొన్నారు.