Listen to this article

జనంన్యూస్. 07. సిరికొండ.నిజామాబాదు.

ఏప్రిల్ 8న ఆల్ ఇండియా నిరసనదినం”కు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పిలుపు. సిరికొండ మండలనాయకులు రాంజీ, ఎం. లింబాద్రిల పిలుపు ఆర్ఎస్ఎస్ బిజెపిల ఫాశిష్టు విధానాలను వ్యతిరేకించండి .ఏప్రిల్ 8న .ఆల్ ఇండియా నిరసనదినంకు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్రకమిటీ పిలుపును ఇచ్చిందని దానిని విజయవంతం చేయాలి అని సిరికొండ మండల నాయకులు కే.రాంజీ, ఎం. లింబాద్రి ల పిలుపును ఇచ్చారుసోమవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్,తుంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా సిరికొండ మండల నాయకులు కే.రాంజీ, ఎం. లింబాద్రి లు మాట్లాడుతు: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా చేస్తున్నారని, మత ఫాసిజం పెరగడానికి కుట్రలు పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, తదితర సమస్యలతో దేశం మొత్తం సతమతమవుతుంటే, ప్రజలు అల్లాడుతుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలు మతఉన్మాదాన్ని తమ యజండగా తీసుకున్నారు అన్నారు. మత ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా నిరసన దినం గా పాటించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలిపించిందని అందులో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పాంప్లెట్లు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 8న నిజాంబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేస్తామని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు సెక్యులరిస్టులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసన దినాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో బి. కిశోర్, ఎం. నారగౌడ్,ఎస్. కిశోర్, జి. బాల్ రెడ్డి, కట్ట. రామన్న, జి. ఎర్రన్న, తూంపల్లి. భూమాగౌడ్, టి. గంగబాపు తదితరులు పాల్గొన్నారు.