

జనం న్యూస్,ఏప్రిల్ 08,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ మరియు రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లద్నాపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ వనం రామచందర్ రావు,కాంగ్రెస్ మంథని అసెంబ్లీ యూత్ కన్వీనర్ బర్ల శ్రీనివాస్ సహకారంతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 103 మంది పాల్గొనగా లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య మరియు టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి 28 మందిని ఆపరేషన్ కోసం ఎంపిక చేయగా వారిని ఉచిత బస్ సౌకర్యం కల్పించి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగిరి ఎ ఎస్ ఐ స్వామి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని , భవిష్యత్తులో మరిన్ని కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేయాలని తెలిపారు. అలాగే ఇట్టి కార్యక్రమానికి సహకరించిన రేకుర్తి కంటి హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ చిదుర సురేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు క్లబ్ అధ్యక్షులు మొలుమూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ,మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు కళాధర్ రెడ్డి, క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, పరంకుశం శ్రీనివాస చారి,తీగల శ్రీధర్, కాటం సత్యం,లద్నాపూర్ మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు