

జనం న్యూస్,ఏప్రిల్07,
అచ్యుతాపురం:అచ్యుతాపురం సెజ్ పరిధి అధిస్తాన్ లో ఉన్న పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మధ్యాహ్నం ఏ,బి షిఫ్ట్ కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ .రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైనిర్ ఎలస్టిక్ పరిశ్రమలో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వెయ్యడం లేదని, అతి తక్కువ బోనస్ తో మోసం చేసి నైట్ డ్యూటీలు చేస్తున్న కార్మికులకు తక్కువ నైట్ అలవెన్స్ ఇచ్చి కార్మికుల్ని శ్రమదోపిడికి గురి చేస్తున్నారని ఇటువంటి శ్రమదోపిడీ చేస్తున్న యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సీఐటీయూ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.