Listen to this article

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెళ్లి నాగరాజు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని మాచనపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8 తరగతులు తదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కెల్ విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ…చదువుతోనే బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని అని అన్నారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి సందీప్, కాంగ్రెస్ నాయకులు గుర్రపు సంపత్ రెడ్డి, బండ రజిని రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.