

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో భవిష్య భారత్ ఎల్ టీ ఐ మైండ్ ట్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్బంగా పేషెంట్లకు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరిగింది.ఈ సందర్భంగా డీపీఎమ్ ఆనంద్ కుమార్ గారు మాట్లాడుతూ..ఈ సంవత్సరం, 2025, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ” ఆరోగ్యకరమైన ఆరంభాలు, ఆశాజనక భవిష్యత్తులు. ” ఈ థీమ్ తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్యం మరియు మనుగడను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది, నివారించదగిన మాతా మరియు శిశు మరణాలపై కూడా అవహగాహన కల్పించారు.1950 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాపించిన ఈ ఆచారం, ఏటా ముఖ్యమైన ఆరోగ్య లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి జాతీయ అధికారులు, సంస్థలు మరియు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది అన్నారు. ఈ కార్యక్రమములో వైద్య సిబ్బంది సోమశేఖర్, విజయలష్మి , ప్రోగ్రామ్ సపోర్ట్ ఆఫీసర్ ముని, సీఓ హాలింపాష తదితరులు పాల్గొన్నారు.