Listen to this article

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

జోగులాంబ గద్వాల్ జిల్లా జంషెడ్ జమ్ములమ్మ హరిత హోటల్ నష్టాల నుంచి బయటపడటం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం దీనితో ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత నూతన టూరిజం పాలసీలో భాగంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచడం, నష్టాల్లో ఉన్న హోటళ్లను లాభదాయకంగా మార్చడం కోసం పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవి మినహా మిగతా ప్రాంతాల్లోని దాదాపు అన్ని హరిత హోటళ్లు త్వరలోనే మద్యం, మాంసాహార సరఫరాకు కేంద్రాలుగా మారిపోనున్నాయి హరిత హోటళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ప్రైవేటు సంస్థలకు లీజు రూపంలో, ఇతర మార్గాల ద్వారా అప్పగిస్తే… ఇటు నిర్వహణ నష్టాల నుంచి బయటపడటంతోపాటు అదనంగా ఆదాయం సమకూరుతుందని పర్యాటకశాఖ అధికారులు ఆలోచనకు వచ్చారు అదే సమయంలో ఆబ్కారీ శాఖకు లైసెన్స్ ఫీజులతోపాటు మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూరుతుందని భావిస్తున్నారు.. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం