

టీడీపీ రజక సాధికారిక స్టేట్ కమిటీ సభ్యులు అడ్డురు శంకర్
జనం న్యూస్,ఏప్రిల్07,
అచ్యుతాపురం:ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాల రజకుల అభినందన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర రజక కమిటీ సభ్యులు అడ్డురు శంకర్ కోరారు. విశాఖపట్నం శివ శంకర్ ఫంక్షన్ హాల్లో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో గల రజక సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ, రాష్ట్ర రజక డైరెక్టర్ గురజాపు రాము, రాష్ట్ర నాయకులు అడ్డురు శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కుల వృత్తిదారులతో పాటు రజకులకు ఉపాధి మరియు వృత్తికి ఆదరణ లేక జీవనోపాధి సాగించడానికి నానా అవస్థలు పడ్డారని, రాష్ట్రంలో ఉన్న అన్ని కులవృత్తులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కుటమి ప్రభుత్వంలో కులవృత్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారు అభినందనలు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వారు ప్రభుత్వంను కోరారు. కూటమి ప్రభుత్వం గెలుపునకు రజకులు అంతా కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో 90శాతం రజకులు టిడిపిలో ఉన్నారని,ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలగా రజకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.50 ఏళ్లకు పింఛను అందించి వృత్తిదారులకు 200 యూనిట్లు వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గురునాధరావు,చీపురుపల్లి స్వరూపు,దామర్ సింగ్, మహాలక్ష్మి,రాంబాబు,అప్పారావు,గంగాధర్,కృష్ణ, ఆది తదితరులు పాల్గొన్నారు.