

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణలోని పేదవాడు కడుపు నింపుకోవడమే కాదు.. సంపన్నులు తినే సన్నబియ్యం తింటూన్నారని సరితమ్మ అన్నారు…. సోమవారం గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల కేంద్రానికి చెందిన హరిజన ముద్దమ్మ తిప్పన్న ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వడ్డించిన జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ వారి కుటుంబ,మహిళ సభ్యులతో కలిసి భోజనం చేశారు….సరితమ్మతో మహిళలు ముచ్చట్లు చెప్పుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అందించడంతో సరైన తిండి తినక పోతుంటిమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడంతో కడుపునిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సరితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సరితమ్మ మాట్లాడుతూ పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా.ఉందన్నారు.రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, 80 శాతానికి పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపాలెం ఆనంద్ గౌడ్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, గుంతబాయి శ్రీను,తిరుపతి,సూరి,సురప్ప, రామకృష్ణ,నందిన్నె ఆంజనేయులు,పటేల్ శ్రీనివాసులు,వెంకటేష్ నాయడు,యర్సన్ దొడ్డి గోవింద్, రాఘవేంద్ర, నరేష్,కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి,పద్మరెడ్డి,రంగస్వామి,రాజారెడ్డి,రహీం,జంగిలప్ప,సిద్దన్ గౌడ్, మహదేవ్,రామన్ గౌడ్, మహేష్,తాయన్న,డికే,సాయన్న,నర్సింహులు తదితరులు ఉన్నారు…టిపిసిసి గద్వాల నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్..