

బిచ్కుంద ఏప్రిల్7:-( జనం న్యూస్) జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో కమ్యూనిటీ సెంటర్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి సహకారంతో బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రోజున కమిటీ మీడియేషన్ సెంటర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ గారు ప్రారంభించారు. కమ్యూనిటీ మెడిసిన్ సెంటర్ అనగా కుటుంబ సమస్యలు, ఆస్తితగాదాలు ,ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా మండలంలోని ఎలాంటి సివిల్ కేసులు ఉన్న పరిష్కరించే విధంగా మండలానికి నలుగురు కమ్యూనిటీ మెడియేషన్ వాలంటరీలో వజిత్ హుస్సేన్, శైలేష్, రిజ్వానా కస్మి , హుoడే బసవరాజ్ , నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిచ్కుంద తహసిల్దార్. సబ్ ఇన్స్పెక్టర్ A మోహన్ రెడ్డి, అడ్వకేట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లిడర్ ఏ విట్టల్ రావు, మల్లేశ్వర్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

