Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్

మామిడి రవి శాయంపేట మండలంలోని గ్రామం సాధనపల్లి/రాజుపల్లి కాట్రపల్లి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మండలంలోని కాట్రపల్లి సాధన పల్లి, రాజు పల్లి గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని ఏఐసీసీ ఆదేశాలమేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని రంగాల్లో రిజర్వేషన్ల ప్రకారం బడుగు బలహీనర్గాలకు సంక్షేమ ఫలాలు, అవకాశాలు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీ జే పీ ప్రభుత్వం 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి, క్రమంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రను తిప్పి కొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మాన లక్ష్యం అని తెలిపారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగాన్ని అనుసరించి అవకాశాలు కల్పిస్తున్నందున ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీ టిసి చల్లా చక్రపాణి మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి మారెపల్లి రవీందర్ కృష్ణమూర్తి చిందం రవి వైనాల కుమారస్వామి జగన్ సతీష్ భాస్కర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు….