

జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలేదన్నారు. తాము డీబీటీ ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచామని.. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచామన్నారు. మహిళలను ఫ్రీ బస్సు పేరుతో మోసం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజల చెవిలో కూటమి ప్రభుత్వం పువ్వులు పెడుతుందన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలపాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.