Listen to this article

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

శ్రీరాములపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా తిరుగుతూ,జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ అభియాన్. కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ బూని వార్డు లో ఈంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. శ్రీరాములపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ప్రచారం ప్రారంభించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్. జై సంవిధాన్ . అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు. ప్రతి వాడవాడలో ఇంటింటికి మన రాజ్యాంగ అవశ్యకతను తెలుపుతూ మహాత్మా గాంధీ. అంబేద్కర్ . రాజ్యాంగాన్ని . చేత పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా నిరసనలు తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం అన్నారు. గాంధేయ మార్గంలో ఊరురా పాదయాత్ర లో జాతీయ జెండా తో మహాత్మా గాంధీ చిత్ర పటం అంబేద్కర్ చిత్రపటం భారత రాజ్యాంగం ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నాం అని వివరించారు.రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశమనగడ సాధ్యం అన్నారు. కేంద్రంలోని బిజెపి రాజ్యాంగ విలువలను కాలరాస్తూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తుందన్నారు. మతవాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే మరోసారి గాందేయ మార్గంలో జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ అభియాన్. పేరుతో గ్రామ గ్రామాన పాదయాత్రలు చేపట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు.అంబేద్కర్ గొప్పతనాన్ని చాటి చెప్పి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రమాణం చేశారు.ఎస్సీ వర్గీకరణ చేసాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేశాం, అని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 200 ల యూనిట్ల ఉచిత విద్యుత్తు ,500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం అని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మేకల సురేష్, మండల అధ్యక్షులు పెద్ది కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, ఓదెలు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజు, సంతోష్ ,పద్మయ, రామస్వామి, రాజేశ్వరరావు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.