

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమం కోసం విలువైన సమయం వెచ్చించి ఎంతో శ్రమించిన, కళానేతలందరితో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆత్మీయ సమావేశం, హైదరాబాద్ శివారులో గల మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామ పరిధిలోని, ఐరా ఫార్మ్స్ హౌస్ లో జరిగింది.ఈ కార్య్రమానికి హుజూరాబాద్ డివిజన్ ఇన్చార్జి గా వ్యవహరించిన శిరీష పాల్గొన్నారు,గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ ని ఘనంగా సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకినపల్లి శిరీష దంపతులతో పాటు, నాయకులు పాల్గొన్నారు.