

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆద్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు మంగళవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ; యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఏర్పరచిన బుడిగె శ్రీకాంత్ ను మరియు మండల కమిటీని అభినందించారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకం అని ఈ సందర్భంగా వారు అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా, యూత్ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల కమిటీ, జిల్లా కమిటీ బాధ్యులు మరియు నియోజకవర్గ కమిటీ బాధ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
