Listen to this article

జనం న్యూస్ 8-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి

జోగిపేట పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి జోగిపేట జోగినాధ జోడు లింగాల జాతర దశమి నాడు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జోగిపేట రథం 50 పిట్ల ఎత్తయిన రథం శ్రీ జోగినాథ స్వామి జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీ జోగినాథ స్వామి రథం విద్యుత్ కాంతులతో కళకళలాడింది. ముందుగా సంప్రదాయ పద్ధతిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి సోమవారం రాత్రి 9-30 మొదలై ఈ ప్రత్యేక రథోత్సవానికి ప్రజలు బంధుమిత్రులు ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు సమేతంగా హాజరై వీక్షించి జోగిపేట జోగినాథ స్వామి కృపకు పాత్రులయ్యారు స్థానిక గౌని చౌరస్తా నుండి జోగినాథ స్వామి గుట్ట పైకి లాగారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.