

జనం న్యూస్ -జనవరి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది, మంగళవారం 14 వ తారీకు రాత్రి 10 గంటలకు హిల్ కాలనీకి చెందిన ఎస్కే నాగూర్ భాష కు పైలాన్ కాలనీకి చెందిన వెంకటేష్ మధ్య జరిగిన గొడవ లో మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కత్తితో నాగూర్ భాష పై దాడి చేయడంతో బాధితుడిని స్థానిక కమల నెహ్రూ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల కోసం నల్గొండ ఆసుపత్రికి తీసుకువెళ్లారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.కె నాగూర్ భాష బుధవారం తెల్లవారుజామున మరణించాడని , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నాగార్జునసాగర్ ఎస్ఐ సంపత్ గౌడ్ తెలిపారు, మరణించిన ఎస్కే నాగూర్ భాష రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాగార్జునసాగర్ టీంకు ఎన్నో పతకాలు అందించిన వ్యక్తి కావడంతో నాగార్జునసాగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.