Listen to this article

గ్రామీణ ఉపాధి హామీ కూలీలపొట్టన కొట్టుతున్న అధికారులు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వినర్.. ముంజం ఆనంద్ కుమార్.

జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ , మొగ్డదగడ్ గ్రామ పంచాయతీ లలో ఉపాధి హామీ కూలీలను పనులు జరిగే ప్రదేశంలోవెళ్లి, వారికి జరుగు అన్యాయాలపై, సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కన్వినర్ ముంజం ఆనంద్ కుమార్ సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాటినగర్ గ్రామస్తులందరు నిరుపేదలు కనీసం భూములు కూడా లేక బతుకు దెరువుకోసం ఉపాధి హామీ కూలీపనులకు ప్రతి రోజు ఉదయం వెళ్లుచున్నారు.పనుల ప్రదేశంలో టెంట్, నీళ్లు, మెడికల్ కిట్ సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని. అధికారులు కొలతలు ఇచ్చిన ప్రకారం తవ్విన కొలతలు తక్కువ ఉన్నవని యాభై రూపాయల నుండి 150 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అన్నారు. వేతనాలు పెంచాలి అని అడిగినందుకు మీరు పనులు చేస్తే చేయండి లేకుంటే లేదు అని అంటున్న అధికారులు ఇంట్లో పడుకోండి అని అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి కూలీలు దీనితో భయబ్రాంతులకు గురి అవుతున్నారు, ఉపాధి కూలీలు. ఛాలిచాలని కూలీలతో సతమాతమౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రతి ఉపాధి హామీ కూలీ కి రెండు వందల పని రోజులు కల్పిస్తూ, కూలీ మూడువందల ఏడు రూపాయలు చెల్లించాలని, పనుల ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ఎక్షగ్రెసియా చెల్లించాలని, సర్కులర్ నెంబర్ 333 రద్దు చేయాలని డిమాండ్ చేసారు. లేని యెడల ఉపాధి హామీ కూలీలకు అండగా ఉండి వారి హక్కులకోసం పోరాటం చేస్తామని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉపాధి హామీ కూలీలకు పనుల ప్రదేశంలో సౌకర్యం కల్పించాలి అని, కూలీలు వేడుకొంటున్నారని, ఏ పి ఓ ను చరవాణి ద్వారా ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అడిగారు కానీ పంచాయతీ కార్యదర్శులు మాత్రం మీరు పెట్టాల్సిన వాళ్ళు పెట్టడం లేదు అన్నారు.ఏది ఏమైనా కూలీలకు సౌకర్యాలు, కల్పించాలని, ఉపాధి హామీ కూలీలు 307రూపాయలు చెల్లించాలని ఆనంద్ కుమార్ అన్నారు..