Listen to this article

నిబంధనలకు విరుద్ధంగా చెరువుకుంటలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా పెట్రేగిపోతుంది.హత్నూర మండలంలోని మల్కాపూర్. రెడ్డి ఖానాపూర్. చందాపూర్. తుర్కల ఖానాపూర్. గ్రామాలలో రాత్రి సమయంలో పది దాటిందంటే చాలు మట్టి మాఫియా చెలరేగిపోతుంది. చెరువు కుంటల నుండి అక్రమంగా హిటాచీల సహాయంతో పెద్ద ఎత్తున నల్లమట్టి తవ్వకాలు జరిపి. భారీ లోడుతో టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న మట్టి మాఫియా. అక్రమంగా తరలిస్తున్న మట్టి టిప్పర్లు రహదారిపై అతివేగంగా వెళ్లడంతో. అటుగా వస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురైతున్నారు. గత కొద్ది రోజుల క్రితం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన యువకులు షిఫ్ట్ కారులో సంగారెడ్డి వెళ్తున్న క్రమంలో. మార్గమధ్యంలోనే చందాపూర్ సమీపంవద్ద ముందుగా వస్తున్న మట్టి టిప్పర్ ఢీకొని ఫిలంల ప్రవీణ్. వయసు 23 సంవత్సరాల యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు త్రీవ గాయాలతో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. 13వ తేదీ సోమవారంనాడు అదే దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మరో యువకుడు మొహమ్మద్ ఆదిల్ హుస్సేన్. వయస్సు 24 సంవత్సరాలు అతని ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి వైపు నుండి దౌల్తాబాద్ వస్తున్న క్రమంలో అతివేగంగా వెళుతున్న మట్టి టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఆయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పరిశ్రమలు ఉండడంతో పొట్ట గూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడే నివసిస్తూ పనిచేసే కార్మికులు. ముఖ్యంగా హత్నూర మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రతిరోజు షిఫ్టుల వారిగా దినసరి కూలీ కోసం కార్మికులు పరిశ్రమకు వెళుతూ ఉంటారు. రాత్రి సమయంలో ఇదే రహదారిపై మట్టి మాఫియా అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా వెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న అటు ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా చెరువు కుంటలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతు చెలరేగిపోతున్న అక్రమార్కుల ఆగడాలపై బ్రేకులు వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు యువకులు కోరుతున్నారు.