Listen to this article

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాస రోశయ్య

జనం న్యూస్, ఏప్రిల్8, జూలూరుపాడు:

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల బ్యాంకు రుణాలు రైతులకు మాఫీ చేయాలని, పంటల బీమా పథకం అమలు చేయాలని, మిర్చి కింటాకు 25 వేల రూపాయల ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పత్తికి కింటాకు 16 వేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని, సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం( ఏఐకేఎస్ ) ఆధ్వర్యంలో ఉదయం 10:00 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్వద్ద ధర్నా కార్యక్రమం జరగనున్నది. కావున జిల్లా నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం.లో సీపీఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు, యాలంకి మధు, రాజేశ్వరరావు. వెంకటి తదితరులు పాల్గొన్నారు.