

జనం న్యూస్ ఏప్రిల్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఈరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసేవలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల మైఖేల్ ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు రఘునాథ్ బాబు అరిగేలా గారు పాల్గొన్నారు. నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు సామాజిక సేవా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. శేరి సతీష్ రెడ్డి గతంలో నియోజకవర్గంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను స్పీకర్ తో పంచుకోగాఏ డాక్టర్ రఘునాథ్ బాబు ఆధ్వర్యంలోని ఆదరణ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా సమగ్రంగా వివరించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సందర్భంగా వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు ప్రజల కోసం పనిచేసే ప్రతి ప్రయత్నానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.