Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్,పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకోచ్చింది. వరుసగా నాలుగో ఓటమితో చెన్నై జట్టు తొమ్మిద వ స్థానానికి పడిపోయింది. మంగళవారం ముల్లన్‌ పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే నలబై తొమ్మిది బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఎంఎస్ ధోని పన్నెండు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు. లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. పంజా బ్ తరఫున ప్రియాంష్ ఆర్య నలబై రెండు బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతను ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రియాంష్ కాకుండా, శశాంక్ సింగ్ యాబై రెండు పరుగులతో, మార్కో జాన్సెన్ ముప్పై నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రెండు జట్ల ప్లేయింగ్-11 చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వికెట్ కీపర్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతిష్ పతిరాణ. పంజాబ్ కింగ్స్- శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్, ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో యాన్సన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.