

నందలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా. మణి యాదవ్ తల్లి గారైన కుర్రా. వెంకటమ్మ శతవసంతాలు (100) పూర్తి చేసుకున్న సందర్భంగా మన్నెం రామమోహన్.ఎస్.ఐ అధ్యక్షతన, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడ పోతుల రాము ఆధ్వర్యంలో అరవపల్లి కృష్ణ మందిరం నందు పుర ప్రముఖుల మధ్య ఘనంగా సత్కార కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మన్నెం. రామ మోహన్ మాట్లాడుతూ పెద్దలు వెంకటమ్మ మనందరికీ మాతృ సమానురాలని, ఆ కాలం నుండి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన పెద్దరికం నిండిన ధన్యజీవులకు సదా వందనాలను తెలియజేస్తూ ఇప్పటికీ ఆరోగ్యపరంగా ఉండటానికి ప్రత్యేక కారణం కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని తినటం ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన అప్పటి రోజుల్లో ఎంతో శారీరక శ్రమతో అలుపు లేకుండా సునాయసంగా పనులు చేసుకుంటూ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండడం నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అని తెలియ జేశారు.నందలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు మాట్లాడుతూ వెంకటమ్మ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఆయు రారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపడానికి అలుపెరగని శారీరక శ్రమ కచ్చితంగా ఉందని తెలియ జేశారు.పోతురాజు మస్తాన్ భారత స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలను చూశారని ఇటువంటి అదృష్టం అందరికీ రావడం చాలా అరుదు అని తెలిపారు.వెంకటరమణ రిటైర్డ్ టీచర్ వెంకటమ్మ ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిగా కాయ కష్టంతో బాగోగులు చూసుకుని ఇంతవారిని చేసుకొని ఇప్పుడు మనవులు ముని మనవులతో ఒక పెద్ద కుటుంబాన్ని చూస్తూ ఆరోగ్యకరమైన జీవితం గడపడం వారికి భగవంతుడు ఇచ్చిన వరం అని తెలిపారు.అనంతరం పుర ప్రముఖుల సమక్షంలో కుర్రామణి యాదవ్ కుటుంబం పాదపూజలతో ఆరంభించి ఘనంగా సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పు శెట్టి సుధీర్, గొబ్బిళ్ళ సుబ్బరామయ్య అడ్వకేట్, గంధం గంగాధర్, గురు ప్రసాద్, కొత్తపల్లి రాజా చారి, మంటి మారయ్య, మట్టి బాబు, గంగాధర్, కానకుర్తి వెంకటయ్య, రమేష్ రాయల్, జంగం శెట్టి హరి, సునీల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, తాటి సుబ్బరాయుడు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం ఆహుతులకు, పేదలకు అల్పాహార సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా జరిగింది.
