Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి ని బుధవారం హుజరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇల్లంతకుంట ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ..అపర భద్రాద్రిగా పేరు పొందిన ఇల్లంతకుంట లోని సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రత్యేక చొరవ తీసుకొని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన శ్రీనివాస్ జీ ని మర్యాద పూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలుపడం జరిగిందని రామారావు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాటు కోసం అహర్నిశలు కష్టపడ్డ పోలీసులకు తమ పాలకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బ్రహ్మోత్సవాల విజయవంతం కావడానికి పోలీస్ శాఖ అందించిన సహకారం మరువలేనిదని రామారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఆలయ ధర్మకర్తలు గోడిషాల పరమేష్, గోలి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.