Listen to this article

రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు..

జనం న్యూస్ జనవరి 15 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :

మన పండుగలు, సాంప్రదాయ, సంస్కృతులను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ పరిరక్షించుకోవాలని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. దేవిపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామం రామాలయం వద్ద మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. తొలిత నిర్వాహకులు ఆయనకు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయనను, రామసేన సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పూర్వికులు, పెద్దలు ప్రతి పండగను మనకు సాంప్రదాయ బద్దంగా అందించి వెళ్లారన్నారు. మన పండగలపై విదేశాల్లో అధ్యయనం చేస్తున్నారని, మనం మట్టుకు గుర్తించలేక పోతునమ్మన్నారు. మన మహిళలు చేవులు, ముక్కు పుడకలు కూటించుకున్న, బొట్టు పెట్టుకున్న, కాళ్లకు చుట్లు పెడుకున్న విటన్నిటికీ ఒక గొప్ప విశిష్టత ఉందన్నారు. మన యోగని ఐదు వందల దేశాల్లో విదేశీయులు ఆచరిస్తూ, ఆరోగ్యాన్ని పొందుతున్నారన్నారు. మన భారతదేశం ఒక విశ్వగురువు అని కొనియాడారు. మన యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కుల, మత, రాజకీయాలకు అతీతంగా మానవత్వానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు. రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం మూడు నియోజకవర్గల్లో తన సేవ కార్యక్రమలు నిత్యం కొనసాకుతూనే ఉంటాయన్నారు. తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. మన భారతీయత వైభవాన్ని తెలిపే విధంగా సనాతన ధర్మం అనే ఒక సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తనపై ప్రతి ఒక్కరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి పదివేల రూపాయలు నగదును నిర్వాహకులకు అందజేశారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన పలు ఆటల పోటీలు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు కంబాల శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ, కట్టా కళ్యాణ్, అమ్మ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి సతీష్ నాయుడు, గండి పోశమ్మ గుడి మాజీ చైర్మన్ గారపాటి వరలక్ష్మి, గురూజీ భగవాన్ శర్మ బాబురావు, శ్రీనివాసరావు, గ్రామస్థులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.