

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించబడిందని ఇది దేశంలోనే మొట్టమొదటిది అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం వ్యక్తమవుతోంది అన్నారు.సన్న బియ్యం లబ్ధిదారుడు బాలనగర్ కు చెందిన రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు బుధవారం బండి రమేష్ తో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రవి గృహంలో సన్న బియ్యం భోజనాన్ని చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదవాడి సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి ,శ్రీకాంత్ పటేల్, శివకుమార్ గౌడ్ ,మధుసూదన్, లక్ష్మయ్య, శివ చౌదరి, రమణ, తదితరులు పాల్గొన్నారు.