

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 46 మంది గర్భవతులను వైద్యాధి కారులు డాక్టర్ శరత్ కమల్ మరియు డాక్టర్ కార్తిక్ విశ్వనాథ్ పరీక్షలు చేయగా అందరి గర్భవతులను డాక్టర్ మస్తానమ్మ గైనకాలజిస్ట్ స్కానింగ్ చేసి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీల్ , PHN శైలజ ఎం ఎల్ హెచ్ పి లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాయల్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గర్భిణులకు, ఆశ కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. రాయల్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు వారి బృందాన్ని వైద్యులు మరియు ప్రజలు అభినందించడం జరిగింది.