

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ విరివిగా చేపట్టడం జరిగిందని ఎన్నారై కె.కె.రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం మేజర్ గ్రామపంచాయతీ నాగిరెడ్డిపల్లి లోని తోటపాలెం లోమన్నూరు రామలక్ష్మమ్మ నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ఎన్నారై కె.కె.రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కారంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు, తోటపాలెం లో మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా మినరల్ వాటర్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విశ్వా వసునామా భక్తి పంచాంగాలను ఆవిష్కరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకు లు మద్దికేర ఓబులేసు, రాజంపేట రూరల్ సీఐ రమణ నందలూరు ఎస్ ఐ మోహన్ కుమార్ గౌడ్, నారాయణ రెడ్డి,సుబ్బారెడ్డి, శివరామి రెడ్డి, కృష్ణా రెడ్డి, జంబు రవి,తదితరులు పాల్గొన్నారు.
