

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన
జనం న్యూస్ జనవరి 15 మండలం పెన్ పహాడ్:
*ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు*
*ఆత్మీయ మేలవింపు కుటుంబాల పరిచయం*
*సాంస్కృతిక నృుత్యాలు ప్రదర్శించిన పూర్వ విద్యార్థులు*
మండలంలోని నాగులపాటి నాగులపాటి అన్నారం బ్రిడ్జి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004–2005 విద్య సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఒకరినొకరు కుటుంబ పరిచయాలు,వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న వృత్తి వ్యాపారాలను నివాసముంటున్న ప్రదేశాలను తెలియపరచుకున్నారు అదేవిధంగా ఆనాడు వారికి విద్య బోధన చేసిన ఉపాధ్యాయులను శాలువాలు,పూల మాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించి కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు విందులు వినోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య, సన్మానం పొందిన ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, రామనాథం, శ్రీశైలం, రమాకాంత్,ఉమామహేశ్వర్, అటెండర్ వెంకటేశ్వర్లు,పూర్వ విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…