

జనం న్యూస్ ఏప్రిల్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వాకర్స్ క్లబ్ అనకాపల్లి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి డాక్టర్ డి డి నాయుడు విశ్వహిందూ పరిషత్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు అయిన సందర్భంగా అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ, పెతకంశెట్టి శ్రీనివాసరావు బొడ్డేడ శ్రీనివాసరావు సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి డి నాయుడు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ ధర్మ రక్షణకు, ఆలయ పరిరక్షణకు, హిందూ సమాజాన్ని శక్తివంతమైన సమాజముగా తీర్చిదిద్దుట, విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ అందరూ ప్రోత్సహించాలని డిడి నాయుడు అన్నారు. అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ సనాతన ధర్మం కాపాడుతూ పెద్దలను గౌరవించే విధంగా, చిన్నపిల్లలకు హిందూ సంప్రదాయాలను తెలియజేయాలని అన్నారు. హరించిపోతున్న కుటుంబ వ్యవస్థలను కాపాడడానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కర్తవ్యంతో మానవ విలువలకు గౌరవిస్తూ, భగవద్గీత, రామాయణం, భారతం, భాగవత ఘట్టాలను చిన్నప్పుడు నుండి పిల్లలకు ఉపదేశించే విధంగా కుటుంబం సభ్యులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వి లోవరాజు కాండ్రేగుల జగ్గారావు కాండ్రేగుల వెంకట సూరి కొణతాల మురళి కొణతాల నాగేశ్వరరావు శిలపరశెట్టి భాస్కరరావు బొడ్డేడ భాస్కరరావు ఆర్టీవో శ్రీను దాడి రాము కైచెర్ల చిన్న బొడ్డేడు మోహన్ కాండ్రేగుల ఆదిబాబు కాండ్రేగుల వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు,