Listen to this article

జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చేత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని DYFI జిల్లా కన్వీనర్, సిహెచ్ .హరీష్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిది ఇప్పటికీ మొదటి సంతకం, నవంబర్ 2, డిసెంబర్ చివరిలోపు, జనవరి మొదటి వారం, ఎమ్మెల్సీఎన్నికలు అయ్యాక విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారు నోటిఫికేషన్ ఇస్తా మన్నారు, ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చాక, అని నిరుద్యోగులకు ఆశ పెడుతూ వచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారం, నోటిఫికేషన్ ఇచ్చి జూన్లొ స్కూల్ తెరిచే సమయము కి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.. వారం రోజులు అవుతున్న ఈ నెలలో ఇప్పటికీ ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వ పెద్దలు డీఎస్సీ పై మాటలు మార్చుతున్నారు. జిల్లా లో దాదాపు గా 20 వేల నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం యధురు చూస్తున్నారు.. అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉందని గత ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో ఒక వైపు కుటుంబం నుంచి ఒత్తిడి మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ హామీలు నమ్మి నోటిఫికేషన్లు వస్తాయని సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకోని విలువైన సమయాన్ని, డబ్బులను పోగొట్టుకోని ఏమి చేయాలో తెలియని పరిస్థితి నిరుద్యోగులకు ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 16, 347 పోస్టులను తక్షణ మే భర్తీ చేయాలి కోరుతున్నాం.. నిరుద్యగు లు కి న్యాయం చేయాలి అని డిమాండ్ చేసారు…