Listen to this article

జనం న్యూస్ ాట్రేని కొన ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


అమలాపురం సమీపంలో చెయ్యేరు నందుగల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డి వి ఎం ఎస్ వర్మ తెలిపారు. ఈ సందర్భం గ కళాశాలలో జరిగిన దంతవైద్య శిబిరం నిర్వహణ కారక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎం. శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ,విద్యార్థుల సంక్షమం కోసం మెరుగైన వైద్య సేవల్లో భాగంగా కిమ్స్ దంత వైద్య బృందం సహాయంతో కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల అధ్యర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భం గ 10 మంది కిమ్స్ దంత వైద్య బృందం కళాశాలలో ప్రతి విద్యార్థిని పరీక్షించి ఉచితం గ పేస్టులు బ్రష్ లు దంత వైద్య మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డి వి ఎం ఎస్ వర్మ,కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎం. శ్రీనివాస కుమార్,కళాశాల పాలక వర్గ సభ్యులు శ్రీ సందీప్ లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం .వెంకటేశ్వర రావు కళాశాల విద్యాశాఖాధికారి డా॥ ఎస్.జయలక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.వి వి బాపి రాజు,వివిధ విభాగాధి పతులు , అధ్యాపకులు, , ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గున్నారు.