


జనం న్యూస్, ఏప్రిల్ 11, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
శుక్రవారం ఉదయం వేద బ్రాహ్మణులచే హోమం, అమ్మవార్లు, పోతురాజుల శిలా విగ్రహాల పూజ, ప్రతిష్ఠాపన కార్యక్రమం.సాయంత్రం పంబాల పూజరుల పూజ, శనివారం పంబాల పూజార్ల ఇల్లు తిరుగుడు అమ్మవారి పేరున చల్లా, అంబలి, నూనే, అమ్మవారికి నైవేద్యం బోనం కోసం బియ్యం, పసుపు, కుంకుమలు సేకరించి అమ్మవార్లకు సమర్పణ. బొడ్రాయి ముందు పోచమ్మ కొలుపు కార్యక్రమం పద్మ పట్నం – బోనం – కథ – సాయంత్రం ఘటంకుండ, బలి చాటాలో సర్వుతో, పంబాల అమ్మవారి వేషంతో ఊరి పొలిమేర చుట్టూ సర్వు చల్లుతూ తిరుగుడు. రాత్రి ఊరు కట్టడి. తెల్లవార్లూ పోచమ్మ భారతి, కథ. ఆదివారం ఉదయం గావుపిల్లా, అమ్మవార్లను సాగనంపుడు, పోచమ్మ మొక్కులు, జాతర జరుగును. గ్రామంలోని ప్రజలందరూ కుల సంఘ నాయకులతో భాగస్వామ్యమై ఖర్చులు భరిస్తూ ఏర్పాట్లను చేశారు.