


46 లక్షలతో నిర్మించిన నవ జాత శిశు కేంద్రం ప్రారంభo
55 లక్షలతో 40 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు
12 లక్షలతో ఆసుపత్రిలో మెకానైజడ్ లాండ్రీ సిద్ధం
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి లో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, ఏప్రిల్- 11, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం ఐఓసిఎల్ సౌజన్యంతో 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేంద్రం, 55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డు, 12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్ లాండ్రీ లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఐఓసిఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) క్రింద అందించిన 10 వార్మర్స్ , 2 డబుల్ సర్ఫర్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్ , సక్షన్ అపారేటస్, బబ్ల్ సి పాప్, వెంటిలేటర్, పొర్టబుల్ X రే వంటి పరికరాలతో నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని, రిస్క్ కేసులను, ప్రీ మెచ్యుర్డ్ ప్రసవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని కూడా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మనం తీసుకుంటున్న చర్యల కారణంగా అవుట్ పేషెంట్ సంఖ్య 700 కు పెరిగిందని, మన దగ్గరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. కంటి శస్త్ర చికిత్సలు, దంత శస్త్ర చికిత్సలు, జనరల్ ఫిజియన్, ఆర్థో శస్త్ర చికిత్సలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇన్ పేషెంట్ సేవలు మెరుగ్గా అమలు చేయాలని అన్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులో ఉందని, డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, డయాలసిస్ కేంద్రం ద్వారా రోజుకు 15 మంది లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ మధ్యలో ఈ ఆసుపత్రిలో 2 డి ఎకో సేవలు కూడా అందుబాటులో వున్నాయి, కావున ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులలో తమ డబ్బును వృధా చేసుకోవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం శాసనసభ్యులు విజయరామరావు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, మరియు అన్ని రకాల శాస్త్ర చికిత్సలు, అన్ని రకాల పరీక్షలు మొదలగు సౌకర్యాలు ఈ జిల్లా ఆస్పత్రిలో నిర్వహించబడుతున్నాయని ప్రజలు ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో ప్రజలు, ఇప్పటినుండి నవజాత శిశువులకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వీటిని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, పిల్లల వైద్య నిపుణులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.