Listen to this article

జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల

కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున సెక్టర్ సూపర్వైజర్ శైలజ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, తల్లులకు పోషకాహారం గురించి ఐరన్ కాల్షియం మిల్లెట్స్ అనుబంధ ఆహారం మొదలగు పోషక ఆహారం, వాటి విలువల గురించి తల్లులకు సలహాలు సూచనలు ఇచ్చారు. గర్భిణీ దశ నుండి వెయ్యి రోజుల వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మరియు ఆరోగ్యం గురించి ఆరోగ్య పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఈరోజు విహెచ్ఎండి కార్యక్రమంలో భాగంగా బాలామృతం టీచర్ పంపిణీ చేశారు .గర్భిణీలు, బాలింతలు, తల్లుల చేత పోషకాహార ప్రతిజ్ఞ చేయించారు. బాలింతల గృహ సందర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్య, సోనా, గోదావరి, పద్మ ,ఆయాలు ,గర్భిణీలు, బాలింతలు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, తల్లులు, కిషోర్ బాలికలు, తదితరులు పాల్గొన్నారు.