Listen to this article

జనం న్యూస్ 10ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.


కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐ.పి.ఎస్, జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ప్రభాకర రావు , ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పి చిత్త రంజన్ ఐ.పి.ఎస్ , అదేశాల మేరకు జైనూర్ మండలం లోని గౌరీ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు జైనూర్ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ.. జైనూర్ మండలం లోని గౌరీ గ్రామంలో తనిఖీలు చేపట్టగా, సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ప్రభుత్వం పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు త్రాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ఏ సమస్య వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు, లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. కార్దన్ అండ్ సెర్చ్ అనంతరం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది . కార్డెన్ సెర్చ్ లో జైనూర్ సీఐ రమేష్, ఎస్సైలు జి.రవికుమార్, రామకృష్ణ,జే.ఉల్లాస్ , బోజ్జిరావు, ఆర్.ఎస్.ఐ మల్లేష్ లతో పాటు 30 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 21 మంది సివిల్ పోలీస్ సిబ్బంది మరియు 08 మహిళా పోలీస్ సిబ్బంది తనిఖీలు చేశామన్నారు.