Listen to this article

శనిగరపు రాజయ్య, కుటుంబ సభ్యులు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిదిలో దర్మారం గ్రామానికి చెందిన శనిగరపు రాజయ్య, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూన్నారు. మంచానికి పరిమితమై, నడవడానికి కూడా కష్టం గా వుండి,కనీసం అరుబయటకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయినది. ఆలయ పౌండేసన్ వారు సహాయం చేస్తారు, అని తెలిసినా వారు చెప్పగా, రాజయ్య ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించారు. వెంటనే ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారికి కో ఆర్డినేటర్ గుణసాగర్ తెలుపగా, రాజయ్య కు వీల్ చైర్ ను అందించడం జరిగింది. ఇ సందర్బంగా రాజయ్య కుటుంబికులు మాట్లాడుతూ.. విద్యా వైద్యం మరియు ఉపాధి లక్ష్యం గా గతా పది సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, జిల్లాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ నరహరి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వుండి జన్మభూమి పై మమకారంతో సేవ చేయడం చాలా సంతోష కరమైన విషయం, అని తెలిపారు. కాలు కోల్పోయి న వికలాంగుల కు జైపూర్ ఫుట్ ను అందించడం, తలసేమియా, వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు, మరియు గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలలో మెగా వైద్యశిబిరాల, తో పాటు కంటి చూపు లేని వారికోసం, ఉచితంగా శస్త్రచికిత్స లు చేయడం ఎంతో గొప్పది అని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గాదె గుణసాగర్ తో పాటు జమ్మికుంట మున్సిపల్, రెండవ కార్పోరేటర్ మారెపల్లి బుక్షపతి, వారి కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు.