

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్10 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మార్క్ శంకర్ పవనో విచ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజ రమేష్ ఆధ్వర్యంలో గురువారం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని చౌత్ర సెంటర్ నందు ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకు పూజా కార్యక్రమం నిర్వహించి 108 కొబ్బరికాయలను జనసేన నాయకులు కొట్టడం జరిగింది. అనంతరం పట్టణంలోని మదర్ తెరిసా కాలనీలోని జె సి ఎఫ్ చర్చి నందు క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ నందు ఉన్న మసీదు నందు దువ్వ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురి అయ్యాడని తెలియడంతో ఒక్కసారిగా అందరం ద్రిగ్బంతి కి గురి అయ్యామని అన్నారు. మంచికి మారుపేరు అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు కి ప్రమాదం జరగటం ఆందోళన చెందామని తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలని ముక్కోటి దేవతలను జనసేన పార్టీ శ్రేణులు అందరూ వేడుకోవటం జరిగిందన్నారు. మార్క్ శంకర్ కోలుకోవాలని చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మునీర్ హసన్, షేక్ సుభాని, పటాన్ ఖాదర్ బాషా, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు బొబ్బిళ్ళ ప్రసాద్, లీలా కిషోర్, కూరపాటి శివశంకర్, పాపన హనుమంతరావు, రామారావు, అచ్చుకొల శేషు, గాజుల అనిల్, ముద్దాయోబు, గాలి రాజా, సాంబ మరియు జనసేన వీర మహిళలు అమరేశ్వరి, హసీనా, లక్ష్మీ ప్రసన్న, సరళ, శ్రావణి, పరమేశ్వరి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళ లు పాల్గొన్నారు.