

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామంలో ఎస్ఆర్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (పిఆర్ఏ) గ్రామీణ విశ్లేషణాత్మక తులనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, మరియు అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
పిఆర్ఏ లో విద్యార్థులు సోషల్ మ్యాపింగ్ వెన్ రేఖ చిత్రాలు వంటి వివిధ భాగస్వామ్య, పద్ధతులను ఉపయోగించి స్థానిక సంఘంతో సమావేశమయ్యారు. ఈ పద్ధతులు సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వనరుల పంపిణీ, సమాజ గతిశీలతను అర్థం చేసుకోవడంలో సాయపడుతుంది అన్నారు. విద్యార్థుల ప్రయత్నాలు ఈ ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి, కీలక సమస్యలను, అవకాశాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ విద్యార్థులు మూడు నెలలుగా గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ప్రదర్శించి రైతులకు, ప్రజలకు వివరించారు. ఇ కార్యక్రమం లో..డీన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ భూపాలరాజ్, రాప్ కో-ఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి, శాస్రవేత్త డా,,మహేష్, కేవీకే రాప్ కో-ఆర్డినేటర్ విష్ణువర్ధన్, అశోక్ మార్గదర్శకత్వంతో విద్యార్థులు సాయి వెన్నెల, కీర్తన, అభినయ, వందన, విశేష ప్రీతి, అనూష, మేఘన, అభినయ, దక్షిత, సాయి ప్రసన్న, హరిణి, హారిక, హర్షిత, శృతి, వర్షిత, నిషా, సద్విత, మల్లీశ్వరి తదితరులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
