

జనం న్యూస్ ఏప్రిల్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపి చెడు
మండలంలో బిజెపి క్రియాశీల సభ్యత సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాజేందర్ చిలిపిచేడు మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ ఆధ్వర్యంలో బిజెపి క్రియాశీల సభ్యత్వం విషయంపై మరియు ఒకే దేశం ఒకే ఎన్నిక మరియు రేపు రానున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపిటిసి గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ మండల సెక్రెటరీ మహేందర్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు మైపాల్ రాజ గౌడ్ అశోక్ ప్రవీణ్ ప్రశాంత్ నాయక్ మండల నాయకులు యాదగిరి రాజు రమేష్ యాదగిరి దశరథ్ రాజు శంకర్ మహేష్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు