Listen to this article

జనం న్యూస్ 16జనవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉన్న పథకములైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా , లకు లబ్ధిదారులను ఎంపిక చేయుటకు గాను గ్రామ సభలను ఏర్పాటు చేయుటకు ఈ నెల 21జనవరి నుండి 24జనవరి వరకుగ్రామాల వారిగా గ్రామా సభలు నిర్వహించుటకుషెడ్యూల్నుమరియు అనుసరించాల్సినటువంటి విధి విధానాల పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల తహసిల్దార్ బి రవీందర్ , మండల పంచాయతీ అధికారి మహేందర్ , అసిస్టెంట్ ఇంజనీర్స్ పి ఆర్ మరియు మండల వ్యవసాయఅధికారి శ్రీకాంత్ మరియు పంచాయతీ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.