

తల్లిదండ్రులు డా, ముక్క నవీన్ డా,స్వాతి..
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ చనిపోవడం ఎంతో బాధాకరం..
ఆయన ఆత్మ ఆ భగవంతుని సన్నిధిలో సేద తీరాలి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట లోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే, ఐరన్ రేకుల షెడ్డు, వరండా,రెండు లక్షల 50 వేల రూపాయల తో, హుజురాబాద్ పట్టణానికి చెందిన, డాక్టర్ ముక్క నవీన్,,డాక్టర్ శ్రీమతి స్వాతి పుణ్య దంపతుల ప్రథమ పుత్రుడు కీర్తిశేషులు ముక్కనివేష్, జ్ఞాపకార్థం నిర్మించిన రేకుల షెడ్డు, వరండా ను వారి తాతయ్య డాక్టర్ శ్రీ కృష్ణమూర్తి ,వారి నానమ్మ ముక్క అరుణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ సూత్రపు బుచ్చి రాములు మాట్లాడుతూ, అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ చనిపోవడం ఎంతో బాధాకర మైన విషయం అని, అన్నారు.ఆయన జ్ఞాపకార్థం మా దివ్యంగా పిల్లల ఆశ్రమంలో ఆయన పేరుపై పిల్లలకు ఉపయోగపడే పెద్ద రేకుల షెడ్డు, వరండా నిర్మించడం ఎంతో గొప్ప విషయం, గొప్ప నిర్ణయం అని ఆయన తెలిపారు. కీర్తిశేషులు ముక్క నివేష్ ఆత్మ పరమాత్మని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని, ఆయన ఆత్మ ఆ భగవంతుని సన్నిధిలో సేద తీరాలని, ఇంత పెద్ద సహకారాన్ని అందించిన డాక్టర్, ముక్క నవీన్ డాక్టర్ శ్రీమతి స్వాతి దంపతులకు మా పేరెంట్స్ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
