

జనం న్యూస్ ఏప్రిల్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
మంచితనానికి చిరునామాగా నిలుస్తూ, ఆసిఫాబాద్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఎస్.చిత్తరంజన్, రెబ్బేన బస్ స్టేషన్ వద్ద వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనంగా నిలిచే చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న వేసవిలో, ప్రజలు జబ్బులు, హీట్ స్ట్రోక్ (సన్ స్ట్రోక్) వంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు తీసుకున్న కీలక చర్యగా భావించబడుతోంది. ఈ కార్యక్రమంలో రెబ్బేన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బుడ్డే స్వామి , ఎస్ఐ డి.చంద్రశేఖర్ , స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి సమిష్టి భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేసింది.
వేసవిలో ప్రజలకు తాగునీటి అవసరం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. రోడ్డుమీద ప్రయాణించే ప్రజలు, వృద్ధులు, పిల్లలు వంటి వారికీ తాగడానికి శుద్ధమైన నీరు అందించాలనే సంకల్పంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజారోగ్యం పరిరక్షణలో ఒక పెద్ద అడుగు. ఇలాంటి సమాజ హిత కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాలని, పోలీసులు, స్థానిక నాయకులు మరియు ప్రజలు కలసి పనిచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ వారు అన్నారు